: జైట్లీ బడ్జెట్ పై ఖర్గే పెదవి విరుపు


ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లికార్జున ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ లో సామాన్యులకు ఎలాంటి ఉపశమనం లభించలేదని, రైతుల రుణమాఫీ డిమాండును అసలు పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. యూపీఏ ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపుల్లో ఉపాధి హామీకి రూ.40వేల కోట్లు ఇచ్చిందని, దాంతో పోలిస్తే ఈ బడ్జెట్ పెద్ద విషయమేం కాదని పెదవి విరిచారు. కూలీలకు రోజుకూలీ వంద రూపాయలు ఉన్నప్పుడే తమ హయాంలో ప్రభుత్వం 40వేల కోట్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. బడ్జెట్ లో మహిళలు, యువతకు ప్రాముఖ్యత ఇవ్వలేదని ఖర్గే విమర్శించారు.

  • Loading...

More Telugu News