: అప్పుడు వాళ్లు కరెక్టు...ఇప్పుడు వీళ్లు కరెక్టు: సినీ నటుడు శ్రీకాంత్


అప్పట్లో సినిమాలు తీసిన దర్శకులు విజయాలు చవిచూశారంటే అప్పటి జనరేషన్ కి వారే కరెక్టని, అలాగే ఇప్పుడు సినిమాలు తీసే దర్శకులు విజయాలు చవిచూస్తున్నారంటే ఇప్పటి జనరేషన్ కి వీరే కరెక్టు దర్శకులని సినీ నటుడు శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. టెర్రర్ సినిమా ప్రమోషన్ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, అప్పటి దర్శకులతోను, ఇప్పటి దర్శకులతోను కలిసి పని చేస్తున్నానని అన్నాడు. అయితే టెక్నాలజీ మారడంతో ఇప్పటి దర్శకులు మరింత సమర్థవంతంగా పని చేస్తున్నారని శ్రీకాంత్ చెప్పాడు. దీంతో ప్రేక్షకులు కూడా వారి పనితనాన్ని ఆస్వాదిస్తున్నారని తెలిపాడు. పరిశ్రమలో అందరితోనూ తనకు మంచి సంబంధాలు ఉన్నాయని శ్రీకాంత్ వెల్లడించాడు. అందుకే మల్టీస్టారర్ సినిమాల్లో తాను ఎక్కువ నటించానని తెలిపాడు. తాను తాజాగా నటించిన 'టెర్రర్' సినిమాలో మంచి కథ ఉందని, ప్రేక్షకులను అలరిస్తుందని శ్రీకాంత్ చెప్పాడు.

  • Loading...

More Telugu News