: నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరైన ప్రభుదేవా
హైదరాబాదులోని నాంపల్లి సీబీఐ కోర్టుకు సినీ హీరో, దర్శకుడు ప్రభుదేవా హాజరయ్యారు. ఆదాయపన్ను శాఖ అధికారి హరిప్రసాద్ అక్రమాస్తుల కేసులో ఆయన సాక్ష్యం ఇచ్చేందుకు వచ్చారు. గగన్ విహార్ లోని సీబీఐ కోర్టులో దాదాపు అర్ధగంట పాటు జరిగిన విచారణకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడేందుకు ఆయన ఇష్టపడలేదు. మెదక్ జిల్లాలోని ఓ భూమిని గతంలో హరిప్రసాద్ నుంచి ప్రభుదేవా కొన్నారని సీబీఐ విచారణలో తేలింది. ఈ క్రమంలోనే సమన్లు అందుకున్న ఆయన ఇవాళ కోర్టుకు వచ్చారు. అయితే తన మేనేజర్ ద్వారానే ఆ భూమిని తాను కొనుగోలు చేశానని, మిగతా విషయాలు తనకేమి తెలియవని ప్రభు కోర్టుకు చెప్పారు.