: రైతులకు రెట్టింపు ఆదాయం అసాధ్యం... ఆలోచన లేని అంతంతమాత్రపు బడ్జెట్: మన్మోహన్ సింగ్


భారత భవిష్యత్తుకు పెద్దగా ఉపయోగం లేని అంతంతమాత్రపు బడ్జెట్ ను అరుణ్ జైట్లీ తీసుకువచ్చారని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పెదవివిరిచారు. రైతుల ఆదాయాన్ని ఐదేళ్లలో రెట్టింపు చేస్తామని పేర్కొనడం అసాధ్యమైన ఆలోచనగా సింగ్ అభివర్ణించారు. ఇది సాకారం కాని కల వంటిదని, ఒకవేళ సాధించగలమని భావిస్తే, దానికి మార్గాలను చెప్పుండేవారని ఎద్దేవా చేశారు. వచ్చే ఐదేళ్లూ సాలీనా 14 శాతం వృద్ధి నమోదైతేనే రెట్టింపు ఆదాయం సంభవమని, కేవలం 2 నుంచి 3 శాతం వృద్ధికే పరిమితమైన వ్యవసాయ వృద్ధిని, జీడీపీని మించిన స్థాయికి ఎలా తీసుకెళ్లగలరో చెప్పాలని మన్మోహన్ సింగ్ డిమాండ్ చేశారు. అయితే, గత సంవత్సరం చెప్పిన ద్రవ్యలోటు లక్ష్యాలకే జైట్లీ కట్టుబడి వాస్తవ పరిస్థితి క్లిష్టంగా ఉందని అంగీకరిస్తున్న సంకేతాలు పంపారని అభిప్రాయపడ్డారు. ఆహార భద్రత గురించి ఆలోచిస్తున్న పాలకులు, ఆ దిశను వీడి ఆదాయ భద్రత గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.

  • Loading...

More Telugu News