: తమిళ హాస్యనటుడు కుమారిముత్తు మృతి
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ తమిళ హాస్యనటుడు కుమారిముత్తు(77) మృతి చెందారు. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. కుమారిముత్తు మృతిపై తమిళ సినీ రంగంతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సుమారు ఏభై చిత్రాలలో నటించిన ఆయనకు 'ఇదు నమ్మ ఆలు', 'సహదేవన్ మహదేవన్', 'ఒరు వూర్ల ఒరు రాజకుమారి' మొదలైన చిత్రాలు నటుడిగా మంచిపేరు తెచ్చిపెట్టాయి. కుమారిముత్తు గతంలో డీఎంకే పార్టీ సభ్యుడిగా ఉన్నారు.