: రోజా పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా
వైసీపీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా పిటిషన్ పై హైకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ అసెంబ్లీ కార్యదర్శిని కోర్టు ఆదేశించింది. తదనంతర విచారణను మార్చి 9కి వాయిదా వేసింది. అసెంబ్లీ సమావేశాల నుంచి తనను ఏపీ ప్రభుత్వం ఏడాది పాటు సస్పెండ్ చేయడంపై రోజా ఆ పిటిషన్ వేశారు. అయితే సస్పెన్షన్ పై స్టే ఇవ్వాలన్న ఆమె అభ్యర్థనను కోర్టు ఇప్పటికే తిరస్కరించిన విషయం తెలిసిందే.