: నిజమైన ద్రోహులను కాపాడుతున్న ప్రధాని: కేజ్రీవాల్ ఆరోపణ
నిజమైన దేశద్రోహులను ప్రధాని నరేంద్ర మోదీ కాపాడుతున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. దేశ సరిహద్దుల్లో సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే... దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న అసలైన ద్రోహులను మోదీ కాపాడుతున్నారని కేజ్రీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. జేఎన్ యూలో దేశ వ్యతిరేక నినాదాలు చేసిన వారు కాశ్మీర్ కు చెందిన వారని కేజ్రీ అన్నారు. వాళ్లను అరెస్టు చేస్తే పీడీపీ నేత మహబూబా ముఫ్తీకి కోపం వస్తుందని.. అందుకే వాళ్ల జోలికి వెళ్లడం లేదంటూ వ్యాఖ్యానించారు. దళితుల కోసం, వెనుకబడిన వర్గాల వారి కోసం పోరాడుతున్న తనపై దేశద్రోహం కేసు నమోదు చేశారని, అయినప్పటికీ వారి కోసం తన పోరాటం ఆగదని కేజ్రీవాల్ అన్నారు.