: గవర్నర్ ప్రసంగం అడ్డుకుంటే ఏడాది పాటు సస్పెన్షన్: తెలంగాణ అసెంబ్లీ రూల్స్ కమిటీ


మార్చి 10 నుంచి జరగనున్న బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ రూల్స్ కమిటీ ఇవాళ సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటే ఏడాది పాటు సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. సభలోకి ప్లకార్డుల అనుమతికి, ప్రశ్నోత్తరాల సమయంలో నిరసనకు నిరాకరించింది. వారంలోగా ఎమ్మెల్యేల ప్రొటోకాల్ కమిటీ నియామకం కానుంది. ఈసారి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండు పూటలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 వరకు నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News