: అమెరికాలో కుప్పకూలిన విమానం... నలుగురు దుర్మరణం


అగ్రరాజ్యం అమెరికాలో కొద్దిసేపటి క్రితం మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. డేవిడ్ వేన్ హూక్స్ ఎయిర్ పోర్టు నుంచి టెక్సాస్ మీదుగా హ్యూస్టన్ వెళుతున్న విమానం నవసోటాలో ఉన్నపళంగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఆకాశంలో ఎగురుతున్న విమానం కన్నుమూసి తెరిచేలోగానే కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News