: 'బడ్జెట్ 2016' ముఖ్యాంశాలు-3!
అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2016లో మరిన్ని ముఖ్యాంశాలు. * ఆదాయపన్ను శ్లాబులు, రేట్లు యథాతథం. * కొత్త పన్నుల కారణంగా ఖజానాకు రూ.19,610 కోట్ల ఆదాయం. * ట్యాక్స్ ట్రైబ్యునల్ కు వచ్చే కేసుల పరిష్కారం కోసం కొత్తగా 11 బెంచ్ ల ఏర్పాటు. * పన్నుల ఎగవేతపై విచారణ మరింత వేగం. * పన్ను ఎగవేతలను సీరియస్ గా పరిగణిస్తాం. * పన్ను ఎగవేశామని ముందుకు వస్తే పన్నులో 50శాతం పెనాల్టీతో సరి. * లేకుంటే పన్నుకు అదనంగా 200శాతం వసూలు. * వ్యవసాయ, మౌలిక వసతుల రంగంపై అదనపు పన్ను. * బ్రెయిలీ పేపర్ పై పూర్తిగా పన్ను మినహాయింపు. * రూ. 2 లక్షల వరకూ కార్ల విడిభాగాల కొనుగోలుపై 1 శాతం సర్వీస్ ట్యాక్స్ అదనం. * కార్లు, ఎస్వీయులు, డీజిల్ వాహనాలకు సర్వీస్ ట్యాక్స్ మినహాయింపు. * ఈపీఎఫ్ కింద పెట్టుబడి రూ. 1.5 లక్షలకు పరిమితం. * వెండి తప్ప, ఇతర నగల మీద 1 శాతం అదనపు ఎక్సైజ్ డ్యూటీ. * బ్రాండెడ్ రెడీమేడ్ వస్త్రాల మీద అదనపు పన్ను. * కోల్, లిగ్నైట్ తదితర ఖనిజాలపై అదనపు పన్ను. * జాతీయ పెన్షన్ పథకం నుంచి విత్ డ్రాలపై ఊరట. * 15.3 శాతం పెరిగిన ప్రణాళికా వ్యయం. * రూ.5.5 లక్షల కోట్లు పెరిగిన ప్రణాళికా వ్యయం. * 100 కోట్లమందికి ఆధార్ అనుసంధానం ద్వారా ఆర్థిక సేవలు. * రీటైల్ ట్రేడ్ విభాగంలో మరిన్ని కొత్త ఉద్యోగాలు. * 18542 గ్రామాలకు ఇప్పటికీ విద్యుత్ సరఫరా లేదు. * వెయ్యి రోజుల్లో వీటన్నింటికీ కరెంటు సరఫరా. * వెనుకబడ్డ వర్గాల కుటుంబాలకు మూడు పథకాలు ప్రవేశం. * నీటి లభ్యత పెంచే విధంగా మరిన్ని చర్యలు. * ఆరు సెక్టార్లలో సంస్కరణలు కొనసాగింపునకు నిర్ణయం.