: బడ్జెట్ తరువాత పెరిగేవి, తరిగేవి ఇవిగో!


ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రతిపాదనల తరువాత ధరలు పెరిగే ఉత్పత్తుల జాబితానే అధికంగా కనిపిస్తోంది. ధరలు తగ్గేలా ఎక్సైజ్, కేంద్ర సుంకాల తగ్గింపు నిర్ణయాలు పెద్దగా లేకపోవడం గమనార్హం. ఇక ఈ బడ్జెట్ తరువాత బ్రాండెడ్ రెడీమేడ్ వస్త్రాలు, లగ్జరీ కార్లు, బంగారం, ప్లాటినమ్ ఆభరణాలు, సిగరెట్లు, గుట్కా, ఖైనీ తదితర పొగాకు ఉత్పత్తులు (బీడీలకు మినహాయింపు), మద్యం ఉత్పత్తులు, ఎల్ఈడీ టీవీలు, హై ఎండ్ స్మార్ట్ ఫోన్లు మరింత ఖరీదు కానున్నాయి. వీటితో పాటు అన్ని రకాల సేవలపై అదనంగా కృషి కల్యాణ్ పన్ను కారణంగా హోటల్, రెస్టారెంట్ బిల్లులు, ప్రయాణ చార్జీలపై మరికొంత చెల్లించుకోవాల్సిన పరిస్థితి. ఇదే సమయంలో కాఫీ, టీలు, వజ్రాలు తదితర రంగు రాళ్లు పొదిగిన ఆభరణాలు, తక్కువ ధరలకు లభించే స్మార్ట్ ఫోన్లు, స్టార్టప్ సంస్థల నుంచి వచ్చే ఉత్పత్తులు, సిమెంట్ తదితరాల ధరలు స్వల్పంగా తగ్గనున్నాయి.

  • Loading...

More Telugu News