: స్వర్ణ దేవాలయంలో సేవకురాలిగా ఐష్... నేల కడిగి, వంట చేసిన వైనం


మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న ఐశ్వర్యరాయ్... ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టి తారాస్థాయికి చేరింది. తదనంతర కాలంలో చోటా బచన్ అభిషేక్ బచ్చన్ ను పెళ్లాడిన ఆమె, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇంట కోడలిగా అడుగుపెట్టింది. పెళ్లి చేసుకున్నా, సిల్వర్ స్క్రీన్ కు వీడ్కోలు పలికేందుకు ససేమిరా అంటున్న ఐష్... తొలి కాన్పు అనంతరం చాలాకాలం పాటు విశ్రాంతి తీసుకుని తాజాగా మళ్లీ బిజీ అయిపోయింది. తాజాగా పాక్ జైల్లో మగ్గి అక్కడే చనిపోయిన భారతీయుడు సరబ్ జిత్ సింగ్ ఇతివృత్తం ఆధారంగా బాలీవుడ్ లో ‘సరబ్ జిత్’ పేరిట ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సరబ్ జిత్ సోదరి పాత్రలో ఐష్ నటిస్తోంది. చిత్రం షూటింగ్ లో భాగంగా అమృత్ సర్ లోని సిక్కుల పవిత్ర ఆలయం స్వర్ణ దేవాలయంలో ఆమె సేవకురాలిగా మారింది. ఆలయంలోని నేలను కడగడంతో పాటు వంట చేసి, భక్తుల మధ్యే కూర్చుని భోజనం చేసింది. చిత్రం షూటింగ్ లో భాగంగానే ఈ పనులన్నీ చేసినా, సిక్కుల ఆచారాలకు ఎక్కడ కూడా లేశమాత్రం భంగం కలిగించకుండా ఆమె వ్యవహరించింది. ఆలయ అధికారుల నుంచి ఎప్పటికప్పుడు సూచనలు తీసుకుని, ఆమె నిజంగా ఆలయంలో సేవకురాలిగానే కనిపించింది. ప్రస్తుతం ఆలయంలో సేవకురాలిగా పనిచేసిన ఐష్ ఫొటోలు విడుదలయ్యాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు వీటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు.

  • Loading...

More Telugu News