: నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్ తిరిగి చర్చలు ప్రారంభించాలి: అమెరికా పునరుద్ఘాటన
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నిలిచిపోయిన చర్చల ప్రక్రియ తిరిగి మొదలుకావాల్సి ఉందని అమెరికా అభిప్రాయపడింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ కాంగ్రెస్ లో జరిగిన చర్చ సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. పొరుగు దేశాలుగా ఉంటున్న భారత్, పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగడం మంచిది కాదని అభిప్రాయపడ్డ జాన్ కెర్రీ... వీలయినంత త్వరలో రెండు దేశాల మధ్య చర్చలు పునరుద్ధరణ కావాలని ఆకాంక్షించారు. రెండు దేశాల ప్రధాన మంత్రులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్ లు ద్వైపాక్షిక చర్చలకు శ్రీకారం చుట్టాలని జాన్ కెర్రీ కోరారు. ఇరు దేశాల ప్రధానులను చర్చల దిశగా తాము ప్రోత్సహిస్తున్నామని కూడా కెర్రీ పేర్కొన్నారు. అమెరికా చట్టసభ కాంగ్రెస్ లో కెర్రీ చేసిన ప్రసంగాన్ని పాక్ పత్రిక ‘డాన్’ పతాక శీర్షికల్లో ప్రచురించింది.