: చంద్రబాబుకు ఎమ్మెల్యే డేవిడ్ రాజు పాదాభివందనం!


విజయవాడలోని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు క్యాంప్ కార్యాలయంలో నిన్న ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి వైసీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా విజయం సాధించిన డేవిడ్ రాజు నిన్న ఆ పార్టీకి ఝలకిచ్చి టీడీపీలో చేరిపోయారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా నుంచి నిన్న ఉదయానికే విజయవాడ చేరుకున్న ఆయన నేరుగా చంద్రబాబు వద్దకు వెళ్లారు. తాను చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలకు ఆకర్షితుడై పార్టీలోకి చేరేందుకు వచ్చిన విపక్ష ఎమ్మెల్యే అయిన డేవిడ్ రాజును చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. చంద్రబాబును చూడగానే డేవిడ్ రాజు కిందకు వంగి చంద్రబాబు పాదాలకు అభివాదం చేశారు. అనంతరం డేవిడ్ రాజును పైకి లేపిన చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అక్కడున్నవారంతా చంద్రబాబుకు డేవిడ్ రాజు పాదాభివందనం చేసిన దృశ్యాన్ని ఆసక్తిగా తిలకించారు.

  • Loading...

More Telugu News