: భారత్ ఆశాజ్యోతి అని ఐఎంఎఫ్ చెప్పింది: బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ వ్యాఖ్య


2016-17 బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కొద్దిసేపటి క్రితం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన సమయంలోనే ఆయన భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టతను ప్రస్తావించారు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలినా, భారత ఆర్థిక వ్యవస్థ ఎలాంటి ఒడిదుడులకు గురి కాలేదని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన... భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) చేసిన కీలక వ్యాఖ్యలను ప్రస్తావించారు. భారత్ ఆశాజ్యోతి అని ఐఎంఎఫ్ చెప్పిందని జైట్లీ పేర్కొన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే దిశగా చర్యలు చేపడుతున్నామని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News