: ఆస్కార్ వేదికపై స్టన్నింగ్ ప్రియాంక... ఇదిగో ఇలా!


మాజీ మిస్ వరల్డ్, అందాల నటి ప్రియాంకా చోప్రా ఆస్కార్ అవార్డుల బహూకరణ వేదికపై మెరిసింది. ఆమెకు అవార్డు ప్రెజంటర్ గా అవకాశం రాగా, వైట్ మ్యాట్ పై ఎంబోజ్ చేసిన ఫ్లవర్ డిజైన్లతో కూడిన స్ట్రాప్ లెస్ సింగిల్ పీస్ డ్రస్ ధరించి వచ్చిన ప్రియాంక, వేదికపై పర్ ఫెక్ట్ గా ఎలా ఉండాలో చూపించి, హాలీవుడ్ ప్రముఖులను అబ్బురపరిచింది. అక్కడి యాంకర్ తో మాట్లాడుతున్న సమయంలో రెడ్ కార్పెట్ పై మరింత అందంగా ఎలా కనిపించాలి? అని అడిగితే, తన శరీరాన్ని 'ఎస్' ఆకారంలో ఉంచి, "ఇదిగో ఇలాగే..." అంది. బాలీవుడ్ కు, హాలీవుడ్ కు పెద్దగా తేడాలుండవని చెప్పింది.

  • Loading...

More Telugu News