: ఈ బడ్జెట్ లో స్పెషల్ స్టేటస్ ఇస్తారని భావించడం లేదు: సుజనా చౌదరి


ఆంధ్రప్రదేశ్ కు ఈ బడ్జెట్ లో ప్రత్యేకహోదా ఇస్తారని తాను భావించడం లేదని కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు రాకపోయినా కొన్నాళ్లలో ప్రత్యేకహోదా రావచ్చని భావిస్తున్నానని అన్నారు. విభజన చట్టంలో పేర్కొనని కొన్ని సౌకర్యాలను కేంద్రం ఇచ్చిందని ఆయన చెప్పారు. ఎన్నో విద్యాసంస్థలు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడుతున్నాయని ఆయన చెప్పారు. తొలి ఏడాది పది వేల కోట్లు వస్తాయని అనుకున్నామన్న ఆయన, 8,800 కోట్ల రూపాయలకు కేంద్రం ఇచ్చిందని ఆయన వెల్లడించారు. కేంద్రం ఇబ్బందులు కేంద్రానికి ఉన్నాయని, వాటిని అనుసరించి ఆంధ్రప్రదేశ్ సమస్యలు తీరుస్తుందని ఆయన అన్నారు. రాజధాని నిర్మాణానికి రావాల్సిన నిధులను కేంద్రం ఇస్తుందన్న విశ్వాసముందని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కనుక దానిని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, అందుకని ఆ ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేస్తుందని ఆయన తెలిపారు. రాజధాని నిర్మాణంలో సాంకేతిక సమస్యలు లేవని ఆయన చెప్పారు. ఒత్తిడితో ఏదీ సాధించలేమని చెప్పిన ఆయన, సహకారంతో ఏదైనా సాధ్యమేనని అన్నారు.

  • Loading...

More Telugu News