: తొలి రోజు కలెక్షన్లు తెచ్చేది హీరోయే: నందిని రెడ్డి
సినిమాను ఎంత బాగా చెక్కినా ప్రేక్షకులు తొలి రోజు సినిమాకు వచ్చేది మాత్రం హీరో ముఖం చూసేనని దర్శకురాలు నందినీ రెడ్డి చెప్పింది. తొలి రోజు హీరోను చూసి వచ్చే ప్రేక్షకులు ఆ తర్వాత సినిమా మీద ఓ అభిప్రాయం చెప్పేస్తారని, తరువాత సినిమా కలెక్షన్లు దాని మీదే ఆధారపడతాయని ఆమె అభిప్రాయపడింది. తొలి రోజు అభిమానులు సినిమా బాగుందని చెప్పినా, కథ లేకపోతే దానిని ఆదరించరని తెలిపింది. ఇమేజ్ ఉన్న హీరోకు మంచి కథ దొరికితే అది అంబరాన్ని అంటుతుందని నందినీ రెడ్డి అభిప్రాయపడింది. తాను పెద్ద హీరో కోసం ఎదురుచూస్తున్న దశలో కొంత మంది సన్నిహితులు, 'నువ్వేంటి, కొత్తగా హీరోల వెంటపడుతున్నావు?' అంటూ అడిగారని, అందుకే ఈ కళ్యాణ వైభోగమే కథను తయారుచేసుకున్నానని చెప్పింది. కథానుసారం నాగశౌర్యను ఈ సినిమాలో ప్రధాన పాత్రకు ఎంపిక చేసుకుని, అతనికి కథ చెప్పానని, ఆయన అంగీకరించడంతో ఈ సినిమా పట్టాలెక్కిందని నందిని తెలిపింది.