: భారత్ లో భారత్ ను ఓడించడం కష్టం: స్మిత్


భారత్ లో టీమిండియాను ఓడించడం కష్టమని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు. టీమిండియాలో సమతుల్యత బాగా కనబడుతోందని ఆయన తెలిపాడు. టీట్వంటీ వరల్డ్ కప్ లో భారతే ఫేవరేట్ అని చెప్పిన స్మిత్, టీట్వంటీల్లో భారత్ ను ఓడించడం కష్టమని అభిప్రాయపడ్డాడు. తమకు భారతజట్టు నుంచే ప్రధానమైన పోటీ ఉంటుందని స్మిత్ చెప్పాడు. భారత్ ను భారత్ లో ఓడించాలంటే చాలా కష్టపడాలని స్మిత్ అన్నాడు. అయితే ఈ ఫార్మాట్ లో ఏ జట్టును తక్కువ అంచనా వేసినా బోల్తాపడక తప్పదని హెచ్చరించాడు. కాగా, ఇప్పటివరకు ఆసీస్ ఖాతాలో టీట్వంటీ వరల్డ్ కప్ లేకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News