: ఇసుక ఉచితంగా ఇవ్వాలని సీఎం నిర్ణయించారు: సీఎం రమేష్
ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి గుర్తించారని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. విజయవాడలో టీడీపీ నేతలతో సమావేశం ముగిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యలను తొలగించేందుకు ఇసుకను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించినట్టు సీఎం వివరించారని అన్నారు. అలాగే ఈ పార్లమెంటు సమావేశాల్లోనే శాసనసభ రీఆర్గనైజేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించామని తెలిపారు. ఈ బిల్లు వెంటనే ఆమోదం పొందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీకి కనీసం ఒక్క రాజ్యసభ సభ్యత్వం కూడా రాదని అర్థమైందని ఆయన అన్నారు. అందుకే నేడు సాక్షి పేపర్ లో ఓ కథనం రాశారని ఆయన చెప్పారు. జగన్ ఎప్పటికప్పుడు పోలవరం, హంద్రీనీవా ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నాడని ఆయన ఆరోపించారు. అలాగే ఉద్యోగుల అంశాన్ని కూడా సీఎం ప్రస్తావించారని ఆయన చెప్పారు.