: 10 లక్షల కోట్లతో 'సాగరమాల' ప్రాజెక్టు: కేంద్రం
మహారాష్ట్ర నుంచి పశ్చిమ బెంగాల్ వరకు ఉన్న సుదీర్ఘ సముద్రతీరాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని భావించిన భారతప్రభుత్వం, ప్రతిష్ఠాత్మకమైన సాగరమాల ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు పది లక్షల కోట్ల రూపాయలు కేటాయించాలని భావిస్తోంది. ఇందులో 4 లక్షల కోట్ల రూపాయలను అవస్థాపన కార్యక్రమాల కోసం వినియోగించనున్నట్టు తెలుస్తోంది. 7,500 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్రతీరాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దేశాభివృద్ధిని వేగవంతం చేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర ఉపరితల రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీలో మాట్లాడుతూ, సాగరమాల ప్రాజెక్టులో భాగంగా 4 లక్షల కోట్ల రూపాయలను అవస్థాపన కార్యక్రమాలు, 6 లక్షల కోట్ల రూపాయలను వివిధ ప్రాజెక్టుల నిర్మాణానికి వినియోగించాలని భావిస్తున్నట్టు తెలిపారు.