: సీటు బెల్టే నన్ను రక్షించింది: ప్రమాదం నుంచి బయటపడ్డ కేరళ సీఎం
కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కేరళలోని కొట్టాయంలో నేటి ఉదయం ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డ్రైనేజీలోకి జారిపోయింది. దీంతో ఆయన గన్ మెన్ కు గాయాలు కాగా, ముఖ్యమంత్రి సురక్షితంగా బయటపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్లే తాను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డానని తెలిపారు. అయితే టైరు పంక్చర్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని కొందరు చెబుతుండగా, డ్రైవర్ నిద్రమత్తులో తూగడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని పలువురు పేర్కొంటున్నారు. కాగా, ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభమైంది.