: తమ్ముడు పరిటాల లేని లోటు కనిపిస్తోంది: మోహన్ బాబు కంటతడి
తమ్ముడు పరిటాల రవి లేనిలోటు కనబడుతోందని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కంటతడిపెట్టారు. అనంతపురం జిల్లా వెంకటాపురంలోని పరిటాల ఘాట్ ను సందర్శించిన సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ్ముడు రవి లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. పరిటాల రవి అడుగుజాడల్లో సునీత ధైర్యంగా నడుస్తోందని ఆయన పేర్కొన్నారు. పరిటాల రవి కుటుంబాన్ని నమ్ముకున్న వారంతా సంతోషంగా జీవిస్తూ, ఆయన కుటుంబానికి అండగా నిలవాలని ఆయన సూచించారు. రాయలసీమ ప్రజలకు ఎల్లవేళలా మంచి జరగాలని కోరుకుంటానని మోహన్ బాబు చెప్పారు.