: 'నీర్జా'కు ఛత్తీస్ గఢ్ లో పన్ను మినహాయింపు... సీఎంకు థ్యాంక్స్ చెప్పిన సోనమ్ కపూర్!


ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కు ప్రముఖ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ధన్యవాదాలు తెలిపింది. సోనమ్ కపూర్ నటించిన 'నీర్జా' సినిమా ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంది. పాన్ అమెరికా విమానం పాకిస్థాన్ లో హైజాక్ కు గురికాగా, అందులో ఫ్లయిట్ అటెండెంట్ గా పనిచేసిన భారతీయ వనిత 'నీర్జా భానోత్' తన ప్రాణాలొడ్డి వందల మంది ప్రయాణికులను రక్షించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో రూపొందిన 'నీర్జా' సినిమాకు విమర్శకుల ప్రశంసలతో పాటు పలు రాష్ట్రాల్లో పన్ను మినహాయింపులు లభిస్తున్నాయి. తాజాగా ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ఈ సినిమాకు వినోదపన్ను మినహాయింపు ఇచ్చింది. దీనిపై హర్షం వ్యక్తం చేసిన సోనమ్ కపూర్ ట్విట్టర్ ద్వారా ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కు ధన్యవాదాలు తెలిపింది. ఆ రాష్ట్రంలో పన్ను మినహాయింపునివ్వడం తనను ఆనందంలో ముంచెత్తిందని ట్వీట్ చేసింది.

  • Loading...

More Telugu News