: మీ వైఖరి చూస్తుంటే నన్ను టీ-20 వరల్డ్ కప్ ఆడనిచ్చేట్టు లేరు: మీడియాతో ధోనీ


క్రికెట్ మైదానంలో అంపైర్లు ఇయర్ ఫోన్, కెమెరా తదితరాలను వాడటం మూలంగా పూర్తి ఏకాగ్రతతో విధులు నిర్వహించలేక పోతున్నారని టీమిండియా కెప్టెన్ ధోనీ వ్యాఖ్యానించాడు. నిన్న పాకిస్థాన్ తో మ్యాచ్ లో ఆశిష్ నెహ్రా వేసిన బంతిని ఖుర్రం మంజూర్ బలంగా కొట్టగా, అది సరాసరి అంపైర్ సైకత్ కాలిని తాకింది. ఆ సమయంలో తన చెవికి తగిలించుకున్న ఇయర్ పీస్ ను సర్దుకునే పనిలో ఆయన ఉన్నాడు. అందువల్లే వస్తున్న బంతిని ఆయన తప్పించుకోలేకపోగా, ఘటనపై స్పందించాలని మీడియా ధోనీని కోరింది. "అంపైర్లపై నన్ను మాట్లాడమంటున్నారు. ఏం, టీ-20 ప్రపంచకప్ లో నన్ను ఆడనివ్వద్దని కోరుకుంటున్నారా? నాపై వేటు పడాలని కోరుకోవద్దండీ" అంటూ సరదాగా స్పందించిన ధోనీ, ఒక చెవికి పరికరంతో, బాల్ బ్యాటును తాకిందా? లేదా? అన్న విషయాన్ని సైతం గుర్తించడంలో అంపైర్లు విఫలమవుతున్నారని ఆరోపించాడు.

  • Loading...

More Telugu News