: కదిలిన పాక్... పఠాన్ కోట్ సూత్రధారుల అరెస్ట్, రిమాండ్!
పఠాన్ కోట్ పై జరిగిన ఉగ్రదాడికి సంబంధించి ముగ్గురు అనుమానిత సూత్రధారులను పాక్ అరెస్ట్ చేసిందని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. గత నెలలో పఠాన్ కోట్ ఎయిర్ ఫోర్స్ బేస్ స్టేషన్ లో జరిగిన దాడిపై విచారణ జరిపిన పాక్ అధికారులు ముగ్గురిని అరెస్ట్ చేసి నిన్న తీవ్రవాద వ్యతిరేక కోర్టు-2లో న్యాయమూర్తి బస్రా జమాన్ ఎదుట హాజరు పరచగా, ఆయన ఆరు రోజుల ఫిజికల్ రిమాండ్ (పోలీస్ కస్టడీ)ను విధించారని 'డాన్' పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఖలీద్ మహమూద్, ఇస్రాదుల్ హక్, మహమ్మద్ షోయబ్ లను సీటీడీ (కౌంటర్ టెర్రరిజం డిపార్ట్ మెంట్) అధికారులు లాహోర్ కు 70 కిలోమీటర్ల దూరంలోని ఓ నివాసంలో అరెస్ట్ చేశారని తెలిపింది.