: అందమైన భవంతుల ముందు ఇంకా అందంగా నేను: తాప్సీ
అందాల భామ, సొట్టబుగ్గల సుందరి తాప్సీ ప్రస్తుతం చికాగోలో పర్యటిస్తోంది. అక్కడి అందాలను చూస్తూ హొయలు పోతోంది. చికాగోలోని ప్రధాన టూరిస్టు ప్రదేశాల్లో ఒకటైన మిలీనియమ్ పార్క్ లో సందడి చేస్తూ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. అక్కడి ఆకాశ హర్మ్యాల ముందు ఫోటోలకు పోజులిచ్చిన ఈ అమ్మడు, అందంగా కనిపిస్తున్న భారీ భవంతుల ముందు తాను ఇంకా అందంగా కనిపిస్తానని చెబుతోంది. మిలీనియమ్ పార్కులో తాప్సీ దిగిన ఫోటోను మీరూ చూడవచ్చు.