: 'బడ్జెట్ డే' నాడు సమ్మె చేయాలని ఎస్బీఐ నిర్ణయం!


ధనలక్ష్మీ బ్యాంకులో జనరల్ సెక్రటరీగా ఉన్న పీవీ మోహనన్ తొలగింపును వ్యతిరేకిస్తూ బడ్జెట్ డే నాడు సమ్మె చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ అనుబంధ ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు సమ్మెకు దిగనున్నట్టు స్పష్టం చేశారు. ఎస్బీఐతో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్ ల నుంచి 90 వేల మంది అధికారులు, సిబ్బంది సమ్మెలో భాగం అవుతారని ఏఐబీఓసీ కార్యదర్శి హవీందర్ సింగ్ తెలిపారు.

  • Loading...

More Telugu News