: జగన్ మోహన్ రెడ్డికి ఆల్ ది బెస్ట్: భూమా అఖిలప్రియ
వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు మంచి జరగాలని తాను, తన తండ్రి కోరుకుంటామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తెలిపారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. స్థానిక పరిస్థితులు, కార్యకర్తల కోరిక, అభివృద్ధి కోసమే పార్టీ మారామని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రానికి తానే కాబోయే ముఖ్యమంత్రినని జగన్ చెప్పుకుంటారు... పార్టీ మారిన మీరు జగన్ కు ఆల్ ది బెస్ట్ చెబుతారా? అని ప్రశ్నించగా, తప్పకుండా చెబుతానని అన్న అఖిలప్రియ, వాళ్ల మంచినే కోరుకుంటున్నట్టు తెలిపారు.