: అప్పటి వరకు పెళ్లిళ్లు వద్దు... మరాట్వాడా యువతుల సంచలన నిర్ణయం!


మహారాష్ట్రలో మరాట్వాడాగా పిలవబడే బీడ్, నాందేడ్, ఉస్మానాబాద్ ప్రాంతాలకు చెందిన యువతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ ప్రాంతంలో కరవు పరిస్థితులు తగ్గేంత వరకూ వివాహాలు చేసుకోబోమని స్పష్టం చేశారు. తీవ్ర వర్షాభావంతో ఈ ప్రాంతంలో పొలాలు బీళ్లయిపోగా, జనవరి నుంచి 139 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక వేలాది మంది పొట్ట చేతపట్టుకుని పక్క రాష్ట్రాలకు వలస పోయారు. ఈ నేపథ్యంలో 25 మంది యువతులు తమ కుటుంబాల్లో పరిస్థితులు మెరుగుపడేంత వరకూ పెళ్లిళ్లు చేసుకోబోమని ప్రతిజ్ఞ పూనారు. వివాహ ఖర్చులను భరించే స్థితిలో తల్లిదండ్రులు లేరని, తమకు పెళ్లిళ్లు కావడం లేదన్న ఆందోళన మధ్య వారిని మరింత ఒత్తిడికి గురి చేయడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నామని సవిత అనే యువతి వెల్లడించింది. కూలి పనులు చేస్తే, తన తల్లిదండ్రులకు సంవత్సరానికి రూ. 30 వేలు మాత్రమే వస్తుందని, ఈ డబ్బుతో కుటుంబం గడవటమే కష్టమైన పరిస్థితుల్లో పెళ్లి ఖర్చులెలావస్తాయని ఆమె ప్రశ్నించింది.

  • Loading...

More Telugu News