: ఇప్పటికి నో, భవిష్యత్తులో చెప్పలేను: రాజకీయాలపై అశ్వనీదత్
పలు భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన అశ్వనీదత్, తాను తిరిగి రాజకీయాల్లోకి ప్రవేశించే విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేశానని గుర్తు చేసుకున్న ఆయన, ప్రస్తుతానికి రాజకీయాల నుంచి తప్పుకున్నానని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేనని తెలిపారు. గత కొంత కాలంగా చిత్ర నిర్మాణానికి సైతం దూరంగా ఉన్న ఆయన, ఓ దినపత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ, త్వరలోనే వరస చిత్రాలను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు వివరించారు. మహేశ్ బాబు హీరోగా, వచ్చే సంవత్సరం మేలో ఓ చిత్రం విడుదలవుతుందని, దీనికి గౌతమ్ మీనన్ దర్శకుడని తెలిపారు. ఆపై రామ్ చరణ్ హీరోగా మరో సినిమాను మొదలు పెట్టనున్నట్టు వివరించారు.