: అప్పుడే ఏమయింది... ముందు ముందు చూడండి: శిద్ధా
వైకాపా సమూలంగా మాయమయ్యే రోజు అతి త్వరలోనే రానుందని ఏపీ రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఎరగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజును చంద్రబాబు వద్దకు తీసుకువచ్చిన ఆయన, ఆపై మీడియాతో మాట్లాడారు. "అప్పుడే ఏమయింది? ముందు ముందు చూడండి. ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారో!" అని ఆయన అన్నారు. పార్టీలోకి రావాలని తాము ఎవరినీ అడగటం లేదని, వైకాపాలో ఇమడలేక, వారంతట వారే తెలుగుదేశం నేతలను సంప్రదిస్తున్నారని తెలిపారు. కాగా, ప్రకాశం జిల్లా మంత్రిగా, శిద్ధా నెరిపిన చర్చల ఫలితంగానే డేవిడ్ రాజు వైకాపాను వదిలి తెలుగుదేశంలోకి వచ్చేందుకు నిర్ణయించుకున్నారని సమాచారం.