: ప్రధానితో కలవనున్న సచిన్, విశ్వనాధన్ ఆనంద్
నేడు జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ తన 'మనసులో మాట'ను వెలువరించనుండగా, తొలిసారిగా లెజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ లు ఆయనతో కలసి ప్రజలతో మాట్లాడనున్నారు. ఈ విషయాన్ని నరేంద్ర మోదీ తన ట్వట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ఆల్ ఇండియా రేడియోతో పాటు, దూరదర్శన్, డీడీ న్యూస్, మొబైల్ యాప్, అన్ని డీటీహెచ్ ప్లాట్ ఫాంలతో పాటు పలు వెబ్ సైట్ల ద్వారా తమ మాటలు వినవచ్చని మోదీ చెప్పారు. పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు మోదీ కొన్ని టిప్స్ ఇస్తారని తెలుస్తోంది. ఈ కార్యక్రమం నేడు ఉదయం 11 గంటలకు మొదలవుతుంది.