: తెలంగాణ అద్భుతం... ఇదిగో చూడండంటున్న కేటీఆర్
తెలంగాణలోని అందమైన ప్రాంతాలను చూపుతూ పర్యాటక శాఖ తయారు చేసిన ఓ వీడియోను మంత్రి కేటీఆర్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా విడుదల చేశారు. అద్భుతమైన లొకేషన్స్ ఇక్కడ ఉన్నాయని, అవన్నీ సినిమాల షూటింగ్ కు అనుకూలమని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిలిం సిటీతో పాటు వరంగల్ లోని చెరువులు, జలపాతాలు, ఖమ్మం జిల్లాలోని గోదావరి అందాలు, పలు సౌకర్యాలు, ప్రదేశాలను చూపుతూ ఈ వీడియో సాగింది. కాగా, తెలంగాణలో చిత్ర నిర్మాణానికి ఎన్నో అనుకూలతలున్నాయని, చెబుతూ, వాటిని అందరికీ పరిచయం చేయాలన్న ఉద్దేశంతో టూరిజం విభాగం ఈ వీడియోను తయారు చేసింది.