: 'డబ్బులివ్వండి, అమరావతిని అడ్డుకుందాం'... శ్రీమన్నారాయణ ప్రచారంపై ఐటీ దృష్టి


"పర్యావరణానికి వ్యతిరేకంగా నిర్మిస్తున్న అమరావతి నిర్మాణాన్ని అడ్డుకుందాం. ఇందుకోసం ఇప్పటికే రూ. 53 లక్షల సొంత డబ్బు ఖర్చు పెట్టాను. ఇక నా దగ్గర కోర్టు ఖర్చులకు నిధులు లేవు. దయచేసి విరాళాలు ఇవ్వండి" అంటూ విజయవాడ నివాసి పందళనేని శ్రీమన్నారాయణ చేస్తున్న ప్రచారంపై ఆదాయపు పన్ను శాఖ దృష్టిని సారించింది. తన ఖాతాలోకి ఇప్పటివరకూ రూ. 1.70 లక్షలు వచ్చాయని కూడా ఆయన తన సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. రూ. 53 లక్షలు ఎక్కడివి? వాటికి పన్ను చెల్లించారా? లాయర్ల ఫీజులు ఎంత? అన్న విషయాలపై ఐటీ శాఖ విచారణ మొదలు పెట్టినట్టు సమాచారం. కాగా, తొలుత తెలుగు రాష్ట్రాల హైకోర్టును, ఆపై సుప్రీంకోర్టును శ్రీమన్నారాయణ ఆశ్రయించగా, వాటిని సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఆపై ఆయన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో కేసు వేయగా, అది విచారణ దశలో ఉంది. పిటిషన్ ను అడ్డు పెట్టుకుని చట్ట విరుద్ధంగా విరాళాలు అడుగుతున్న శ్రీమన్నారాయణపై ఏపీ సర్కారు సైతం సీరియస్ గా ఉంది. ఈ విషయంలో ఎన్జీటీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది.

  • Loading...

More Telugu News