: విజయవాడ ప్రతిష్టను దెబ్బతీసే సినిమా వద్దు: బొండా ఉమ
విజయవాడలో ఎప్పుడో జరిగిన సంఘటనను సినిమాగా తీయబోతున్న దర్శకుడు రాంగోపాల్ వర్మపై ఎమ్మెల్యే బొండా ఉమా ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాభారతంలో జరిగిన హింసకంటే విజయవాడలో జరిగిన హింసే ఎక్కువన్న వర్మ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ప్రస్తుతం అందరూ విజయవాడ అభివృద్ధినే కోరుకుంటున్నారన్నారు. అంతేగానీ విజయవాడ ప్రతిష్టను దెబ్బతీసే సినిమాలు కోరుకోవడం లేదని చెప్పారు. ఈ విషయాన్ని దర్శకుడు వర్మ ముందు గ్రహించాలని హితవు పలికారు. 'వంగవీటి' సినిమా కనుక విడుదలైతే మళ్లీ గొడవలు తలెత్తే అవకాశం ఉందని, దయచేసి ఆ సినిమాను నిలిపివేయాలని మీడియా సమావేశంలో కోరారు.