: కోర్టు ముందు హాజరుకావాలని మారన్ సోదరులకు సమన్లు
ఎయిర్ సెల్-మ్యాక్సిస్ కేసులో టెలికాం మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్, కళానిధి భార్య కావేరీలకు ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. వారితో పాటు ఎస్ఏఎఫ్ఎల్, సన్ డైరెక్ట్ సంస్థలకు కూడా సమన్లు జారీ అయ్యాయి. ఎయిర్ సెల్-మ్యాక్సిస్ ఒప్పందంలో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ జులై 11న కోర్టు ముందు హాజరుకావాలని సమన్లలో తెలిపింది. అంతకుముందు ఈడీ నమోదు చేసిన చార్జ్ షీటును కోర్టు పరిశీలించగా, ఎయిర్ సెల్ షేర్లను మలేసియాకు చెందిన మ్యాక్సిస్ సంస్థకు అమ్మేలా మారన్ సోదరులు ఒత్తిడి తెచ్చారని ఈడీ పేర్కొంది. ఆ తరువాతే సమన్లు జారీ చేయాలని కోర్టు నిర్ణయించింది.