: నువ్వా? నేనా?... మరికొన్ని గంటల్లో దాయాదుల క్రికెట్ పోరు!
ఎంతో కాలంగా దాయాది దేశాల క్రికెట్ పోరు కోసం ఎదురుచూస్తున్న ఉపఖండం క్రికెట్ అభిమానులు భారత్-పాక్ మ్యాచ్ చూసేందుకు సిద్ధమవుతున్నారు. ఆసియా కప్ టీ20 లో భాగంగా మరికొన్ని గంటల్లో దాయాది దేశాలు భారత్-పాక్ తలపడనున్నాయి. బంగ్లాదేశ్ లోని మిర్పూర్ వేదికగా జరగనున్న టీట్వంటీ మ్యాచ్ లో గెలుపు కోసం రెండు దేశాల క్రీడాకారులు హోరాహోరీగా తలపడతారనడంలో సందేహం లేదు. భారత్ కు బ్యాటింగ్ ఆర్డర్, పాకిస్తాన్ కు బౌలింగ్ వనరులు ఉండటంతో ఈ పోరు నువ్వా? నేనా? అనే స్థాయిలో ఉంటుందనే అభిప్రాయాన్ని క్రికెట్ దిగ్గజాలు, విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.