: బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కారుపై కోడిగుడ్లతో దాడి


ఢిల్లీలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన కారును కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుని నానాయాగీ చేశారు. నవాబ్ గంజ్ లోని వీఎస్ఎస్ డీ కళాశాలలో గ్లోబల్ టెర్రరిజంపై నిర్వహించిన ఒక సెమినార్ కు వెళ్లిన ఆయన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. నల్లజెండాలతో నిరసన తెలిపారు. ఆయన కారుపై నల్ల సిరా చల్లి, కోడిగుడ్లు, టమోటాలు విసిరారు. దీంతో, పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపు చేసేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోవడం.. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు.

  • Loading...

More Telugu News