: బండ జ్యోతి మృతిపట్ల సినీ ప్రముఖుల సంతాపం
హాస్యనటి బండ జ్యోతి (జ్యోతి పట్నాయక్) మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. హైదరాబాదులోని నానక్ రాంగూడలోని నివాసంలో ఉన్న ఆమె భౌతికకాయాన్ని 'మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, సినీ నటి హేమ, పలువురు టీవీ నటులు సందర్శించి నివాళులర్పించారు. జ్యోతి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు రాజేంద్రప్రసాద్ అన్నారు. మా తరపున నిర్వహించాల్సిన కార్యక్రమం చేస్తామని తెలిపారు. మూడు రోజుల నుంచి వరుసగా జ్యోతి ఆహారం తీసుకోకపోవడంతో బీపీ డౌన్ అయి గుండెపోటు వచ్చిందంటున్నారని హేమ చెప్పారు.