: ప్రధాని సొంతూళ్లోని పాఠశాలలో టాయిలెట్లు లేవు!... గుజరాత్ అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి ప్రకటన


గడచిన సార్వత్రిక ఎన్నికల్లో తన ఛరిస్మాతో బీజేపీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన నరేంద్ర మోదీ... గుజరాత్ సీఎం పదవికి రాజీనామా చేసి, ప్రధానమంత్రి పీఠమెక్కారు. ఆ వెనువెంటనే స్వచ్ఛ భారత్ అభియాన్ పేరిట భారీ పథకానికి శ్రీకారం చుట్టారు. సర్కారీ విద్యాలయాల్లో బాలికలతో పాటు బాలురకు కూడా వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎంపీలు తమకు కేటాయించిన ఎంపీల్యాడ్స్ లోని నిధుల కేటాయింపులో ఈ విషయానికి ప్రాధాన్యమివ్వాలని కూడా ప్రభుత్వం కోరింది. ఇతర నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉన్నా, సాక్షాత్తు నరేంద్ర మోదీ సొంతూరు వద్ నగర్ లోని పాఠశాలలోనే బాలురకే కాక బాలికలకు కూడా మరుగుదొడ్లు లేవట. ఈ విషయాన్ని ఏ వార్తా సంస్థో ప్రకటించలేదు. బీజేపీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వమే ఆ రాష్ట్ర అసెంబ్లీ వేదికగా చెప్పిన నగ్న సత్యమిది. గుజరాత్ ఎమ్మెల్యే ప్రహ్లాద్ పటేల్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చిన ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి భూపేంద్ర సిన్హా చుదాసమ... ప్రధాని సొంతూరు వద్ నగర్ సహా సీఎం ఆనందిబెన్ పటెల్ సొంతూరు విజాపూర్ లోని పాఠశాలలోనూ మరుగుదొడ్లు లేవని ప్రకటించారు.

  • Loading...

More Telugu News