: రాజకీయాలను చంద్రబాబు వ్యాపారంగా మార్చేశారు: ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడంపై ఆ పార్టీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసుకుంటూ పోతే రాచరిక కాలంనాటి వ్యవస్థ పునరావృతమవుతుందని హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. రాజ్యాంగం ద్వారా ఏర్పడిన ప్రతిదీ న్యాయ వ్యవస్థకు లోబడే ఉండాలని, అసెంబ్లీ స్పీకర్ కూడా అందుకు మినహాయింపు కాదని స్పష్టం చేశారు. ఈ సమయంలో ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడిన ధర్మాన, రాజకీయాలను ఆయన పూర్తిగా వ్యాపారంగా మార్చేశారని ఆరోపించారు. పార్టీ పిరాయింపులపై రాజ్యాంగ సవరణ చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.