: ప్రకాశం జిల్లా వాసిని విడిచిపెట్టిన నైజీరియా గిరిజనులు


నైజీరియాలో కిడ్నాపైన ప్రకాశం జిల్లా కందుకూరి వాసి అయిశెట్టి వెంకట పవన్ కుమార్ క్షేమంగా ఉన్నాడని తెలిసింది. అతడిని గత రాత్రి (శుక్రవారం) కిడ్నాపర్లు విడిచిపెట్టారు. నైజీరియాలోని పామ్ ఆయిల్ ఉత్పత్తికి సంబంధించిన ఓ భారతీయ సంస్థలో పవన్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఈ నెల 20న కుటుంబ సభ్యులకు పోన్ చేసిన అతను తాను ఇబ్బందుల్లో ఉన్నానని, రెండు రోజుల్లో తన నుంచి ఫోన్ రాకుంటే మెయిల్ లో ఉన్న కంపెనీ నెంబర్ కు ఫోన్ చేయాలని తెలిపాడు. చెప్పినట్టుగానే పవన్ నుంచి కుటుంబ సభ్యులకు ఎలాంటి ఫోన్ రాలేదు. దాంతో తమ కుమారుడు కిడ్నాప్ అయ్యాడని, ఆయుధాలతో వచ్చిన కొందరు నైజీరియా గిరిజనులు పవన్ ను తీసుకువెళ్లారని కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. వెంటనే రాయబార కార్యాలయానికి, కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ కు తెలిపారు. పవన్ కిడ్నాపయ్యాడంటూ అతని బాబాయి మీడియాకు వెల్లడించిన రోజే, కిడ్నాపర్లు అతనిని సురక్షితంగా వదిలిపెట్టారని, ఈ మేరకు తమకు నైజీరియా నుంచి సమాచారం అందినట్టు కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు.

  • Loading...

More Telugu News