: ఎర్రబెల్లికి దక్కేది... కేసీఆర్ ఫాంహౌజ్ లో వాచ్ మన్ ఉద్యోగమే: రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్య


టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ అసెంబ్లీలో టీ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి సైకిల్ పార్టీకి ఝలక్కిచ్చి టీఆర్ఎస్ లో చేరిన ఎర్రబెల్లి దయాకర్ రావుపై నిన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నిన్న నామినేషన్లకు తుది గడువు కావడంతో టీ టీడీపీ అభ్యర్థులను తమవైపు తిప్పుకునేందుకు టీఆర్ఎస్ యత్నించిందన్న వార్తలు గుప్పుమన్నాయి. దీంతో తమ పార్టీ అభ్యర్థులను టీ టీడీపీ హైదరాబాదులోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు తరలించింది. ఈ సందర్భంగా అభ్యర్థులతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రలోభాలకు లోను కామని, పార్టీ మారబోమని వారితో ఆయన ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆయన ఎర్రబెల్లిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎర్రబెల్లికి టీఆర్ఎస్ లో దక్కేది వాచ్ మన్ పోస్టేనని ఆయన అన్నారు. ‘‘ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్ లో చేరినంక కేసీఆర్ పక్కన నిలబడబోగా, పోయి కూచో పో అని కేసీఆర్ అన్నరట. ఇప్పుడు ఆయనకు మిగిలింది కేసీఆర్ ఫాంహౌజ్ లో వాచ్ మన్ ఉద్యోగమే’’ అని రేవంత్ అన్నారు.

  • Loading...

More Telugu News