: బాలయ్య ఇలాకాలో ‘లేపాక్షి’ సంబరాలు... హాజరుకానున్న చంద్రబాబు, వెంకయ్య
టాలీవుడ్ అగ్ర నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురంలో నేటి నుంచి లేపాక్షి ఉత్సవాలు హోరెత్తనున్నాయి. ఇప్పటికే మూడు రోజులుగా హిందూపురంలోనే తిష్ట వేసిన బాలయ్య సైకిల్ ర్యాలీ, 5కే రన్ లతో పట్టణంలో పండుగ వాతావరణానికి తెర తీశారు. తాజాగా ఏపీ సర్కారు అధికారికంగా నిర్వహిస్తున్న లేపాక్షి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రాచీన లేపాక్షి శిల్పకళా వైభవం ఉట్టిపడేలా భారీ ఏర్పాట్లు జరిగాయి. ఈ కార్యక్రమాలకు నేడు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు. నేడు, రేపు జరిగే ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో ప్రముఖులు హాజరుకానున్నారు.