: దాయాదీ పోరు నేడే!... ఆసియా కప్ లో భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్
ప్రపంచ క్రికెట్ లవర్స్ కు ఈ రోజు నిజంగా పండుగే. ఎందుకంటే భారత ఉపఖండంలోనే కాకుండా విశ్వవ్యాప్తంగా భారీ ప్రజాదరణ కలిగిన భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ నేడు జరుగుతోంది. బంగ్లాదేశ్ లోని మిర్పూర్ లో నేటి రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆసియా కప్ లో భాగంగా భారత్, పాక్ లతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, యూఏఈ జట్లు పాలుపంచుకుంటున్న సంగతి తెలిసిందే. లీగ్ దశ పోటీల్లో భాగంగా నేడు భారత్, పాక్ జట్లు తలపడనున్నాయి. చాలా కాలం తర్వాత ఈ రెండు దేశాల జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ పట్ల విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. భారత్, పాక్ దేశాల్లో క్రికెట్ అభిమానులంతా టీవీలకు అతుక్కుపోనున్నారు.