: అమ్మాయిలను తప్పుదోవ పట్టిస్తున్న జూనియర్ ఆర్టిస్టు అరెస్టు
సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెబుతూ పలువురు అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న ఒక జూనియర్ ఆర్టిస్ట్ సహా ఐదుగురిని తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి అర్బన్ ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం, శివజ్యోతి నగర్ లోని ఒక అపార్ట్ మెంట్ లో పోలీసులు దాడులు నిర్వహించారు. గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్న సదరు జూనియర్ ఆర్టిస్టు సహా విటులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.19 వేలతో పాటు 10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సినిమాల్లో నటించాలనే ఆసక్తితో వచ్చే అమ్మాయిలు ఇటువంటి వారి బుట్టలో పడవద్దని, వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని అర్బన్ ఎస్పీ సూచించారు.