: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ కు అరెస్టు వారెంట్ జారీ
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఉద్యోగ నియామకాల కుంభకోణం కేసుకు సంబంధించి కోర్టుకు హాజరు కాకపోవడంతో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు భోపాల్ న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 1993-2003 సంవత్సరాల్లో దిగ్విజయ్ మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ కుంభకోణం జరిగింది. ఈ విషయంలో గత ఏడాది ఫిబ్రవరి 1న జహంగీరాబాద్ పోలీసులు ఆయనతో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం దిగ్విజయ్ కోర్టుకు హాజరుకాకపోవడంతో న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.