: ఏపీ ఎక్స్ ప్రెస్ వేగం పెంచలేం... హాల్టింగ్ ల సంఖ్య కుదించలేము: రైల్వే మంత్రి
విశాఖ-న్యూఢిల్లీ మధ్య నడిచే ఏపీ ఎక్స్ ప్రెస్ పేరును మార్చడం, దాని వేగం పెంచడం, హాల్టింగ్ ల సంఖ్య కుదించడం సాధ్యపడదని రైల్వేమంత్రి సురేశ్ ప్రభు తేల్చి చెప్పారు. ఎంపీ ఎంఎ ఖాన్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సురేశ్ ప్రభు పైవిధంగా సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోని పలు పట్టణాలను దేశ రాజధానితో అనుసంధానించేందుకు ఉద్దేశించినందున 19 హాల్టింగ్ లతో నడుస్తోందన్నారు. రాజధాని, దురంతో ఎక్స్ ప్రెస్ ల తరహాలో ఈ ఎక్స్ ప్రెస్ పనిచేసే అవకాశం లేదన్నారు. ఏపీ ఎక్స్ ప్రెస్ కు నాన్-ఏసీ బోగీలను కలపాలని పలు విజ్ఞప్తులు వచ్చాయని మంత్రి అన్నారు.