: రాజకీయాలతో ప్రజాసేవ, సినిమాల ద్వారా వినోదం అందిస్తా: బాలకృష్ణ


రాజకీయాలతో ప్రజాసేవ, సినిమాల ద్వారా వినోదం అందించడమే తన లక్ష్యమని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాజకీయాలు, సినిమాల ద్వారా తాను ప్రజలకు చేయగల్గినంత సేవ చేస్తానని అన్నారు. ప్రపంచం దృష్టిని ఆకర్షించే విధంగా ఈ లేపాక్షి ఉత్సవాలను నిర్వహించనున్నామన్నారు. భగవంతుడు కల్పించిన అవకాశం వల్లే ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తనకు ఆధ్యాత్మిక చింతన ఉందన్న విషయం అందరికీ తెలుసని, రోజుకి సుమారు రెండు గంటలపాటు పూజ చేస్తానని, అందరికీ మంచి జరగాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. మన కృషితో పాటు దేవుడి దయ కూడా ఉంటే బ్రహ్మాండంగా ఉంటుందన్నారు. యాంత్రిక జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితం వైపు మళ్లించాలని బాలకృష్ణ అన్నారు.

  • Loading...

More Telugu News